దిల్ సే' చిత్రంలోని మొదటి సాంగ్ 'రెండు కన్నులతో' కు యూట్యూబ్ లో 1 మిలియన్ వ్యూస్!!!

Updated: Sunday, February 21, 2021, 18:56 [IST]

శ్రీ చైతన్య క్రియేషన్స్ బ్యానర్ పై  మాస్టర్ రితిక ప్రజెంట్స్ సమర్పణలో అభినవ్ మదిశెట్టి స్నేహ సింగ్ హీరో హీరోయిన్లు గా రవికుమార్ సబ్బాని స్వీయ దర్శకత్వంలో వస్తోన్న సినిమా దిల్ సే. ట్రయాంగిల్ లవ్ స్టోరీతో వస్తోన్న ఈ సినిమా దాదాపు పూర్తి అయ్యింది.

ఇటీవల విడుదలైన ఈ సినిమా మొదటి సాంగ్  'రెండు కన్నులతో' కు మంచి స్పందన లభించింది. లహరి మ్యూజిక్ ద్వారా విడుదలైన ఈ పాట 1 మిలియన్ వ్యూస్ కు చేరుకుంది. శ్రేయ ఘోషల్ పాడిన ఈ పాటకు నూతన సంగీత దర్శకుడు శ్రీకర్ సంగీతం అందించాడు. ఈ ఏడాది వేసవిలో 'దిల్ సే' సినిమాను విడుదల చెయ్యడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

నటీనటులు:
అభినవ్ మేడిశెట్టి, సశ్య సింగ్, లవ్లీ సింగ్, విస్మయ శ్రీ, వెంకటేష్ కాకుమాను,  

బ్యానర్: శ్రీ చైతన్య క్రియేషన్స్
సమర్పణ: మాస్టర్ రితిక్
కథ, డైరెక్టర్, నిర్మాత: రవికుమార్ సబ్బాని
కెమెరామెన్: రాహుల్ శ్రీ వాత్సవ్
మ్యూజిక్: శ్రీకర్ వెళమురి
స్క్రీన్ ప్లే, డైలాగ్స్: రఘుపతి రెడ్డి.జి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: మహాదేవ్ శాస్త్రి
ఎడిటర్: ప్రభుదేవా
కొరియోగ్రాఫర్: జావిద్
ఆడియో: లహరి మ్యూజిక్
ప్రొడక్షన్ కంట్రోలర్: పికె.రవికుమార్ యాదవ్