రానా చేతుల మీదుగా విడుదలైన రామ్స్‌ ‘పచ్చీస్‌’ ట్రైలర్‌

Updated: Wednesday, June 9, 2021, 18:41 [IST]

టాలీవుడ్‌ సెలబ్రిటీ డిజైనర్‌ రామ్స్‌ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘పచ్చీస్‌’. ఈ క్రైమ్‌ థ్రిల్లర్‌కు శ్రీకృష్ణ, రామసాయిలు సంయుక్తంగా దర్శకత్వం వహిస్తున్నారు. శ్వేతావర్మ హీరో యిన్‌. అవాస చిత్రం, రాస్తా ఫిల్మ్‌ బ్యానర్స్‌ పతాకాలపై కత్తూరి కౌశిక్‌ కుమార్, రామ సాయి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

తాజాగా ఈ ‘పచ్చీస్‌’ సినిమా ట్రైలర్‌ను హీరో రానా విడుదల చేశారు. ట్రైలర్‌లోని సన్నివేశాలు, ఆసక్తి కలిగించే ప్రశ్నలు, దాగి ఉన్నట్లుగా ఉన్న ట్విస్ట్‌లు ఈ సినిమాపై అంచనాలను పెంచేస్తున్నాయి. ఈ సినిమాలోని ప్రతి క్యారెక్టర్‌కు ప్రాముఖ్యత ఉండేట్లుగా దర్శకులు తెరకెక్కించారు. జీవితంలో ఏదో సాధించాలనుకునే ఓ వ్యక్తి అనుకోకుండా ఓ క్రైమ్‌లో చిక్కుకుంటే అతని జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి? అతను వాటిని ఎలా పరిష్కరించుకుంటాడు? అన్న అంశాల నేపథ్యంలో ఆద్యంతం ఉత్కంఠగా ఈ సినిమా సాగుతుందని ట్రైలర్ చూస్తే తెలుస్తుంది.

ఈ సినిమా దర్శకద్వయం సాయికృష్ణ, రామసాయిలు అందించిన స్క్రీన్‌ ప్లే, కథ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తాయి. ఇక కార్తీక్‌ పర్మార్‌ సినిమాటోగ్రఫీ, సమ్రాన్‌ సాయి బ్యాగ్రౌండ్‌ స్కోర్‌ ఈ సినిమాకు అదనపు ఆకర్షణలు. ‘పచ్చీస్‌’ సినిమా ఈ నెల 12 నుంచి ఆమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌ కానున్నట్లు చిత్రయూనిట్‌ వెల్లడించింది.

నటీనటులు
రామ్స్, శ్వేతా వర్మ, జయచంద్ర, రవి వర్మ, కేశవ్‌ దీపక్, ధ్యాన్‌చంద్‌ రెడ్డి, శుభలేక సుధాకర్, విశ్వేందర్‌ రెడ్డి

సాంకేతిక నిపుణులు
డైరెక్టర్స్‌: శ్రీకృష్ణ, రామసాయి
బ్యానర్స్‌: ఆవాస చిత్రం, రాస్తా ఫిలింస్‌
ప్రొడ్యూసర్స్‌: కౌశిక్‌ కుమార్‌ కొత్తూరి, రామసాయి
కో ప్రొడ్యూసర్‌: పుష్పక్‌ జైన్‌
ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: దినేష్‌ యాదవ్‌ బొల్లేబోయిన
రచయిత: శ్రీకృష్ణ
డీఓపీ: కార్తిక్‌
మ్యూజిక్‌ డైరెక్టర్‌: సమరాన్‌ సాయి
ప్రొడక్షన్‌ డిజైనర్‌: రోహన్‌ సింగ్‌
ఎడిటర్‌: రానా ప్రతాప్‌
సౌండ్‌ రికార్డిస్టు: అశ్విన్‌ రాజశేఖర్‌
కాస్ట్యూమ్స్‌: రామ్స్‌
సౌండ్‌ డిజైన్‌: నాగార్జున తల్లపల్లి
మేకప్‌: విధి సేతి
పబ్లిసిటీ డిజైనర్స్‌: అనిల్‌ అండ్ బాను
లిరిసిస్ట్‌: నిఖిలేష్‌ సుంఖోజీ
కలరిస్టు: అవినాష్‌ శుక్లా