సిద్ధార్థ్, జీవిప్రకాష్ కుమార్ పోటాపోటీగా నటించిన 'ఒరేయ్ బామ్మర్ది' చిత్రం ఫస్ట్ లుక్ విడుదల..!!

Updated: Monday, April 5, 2021, 14:19 [IST]

 
సిద్ధార్థ్, జీవీ ప్రకాష్ లు హీరోలుగా తెరకెక్కుతున్న చిత్రం 'ఒరేయ్ బామ్మర్ది'.. బిచ్చగాడు లాంటి సూపర్ హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన శశి ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా కశ్మీర పరదేశి, లిజోమోల్ జోస్ లు హీరోయిన్ గా నటిస్తున్నారు.. అభిషేక్ ఫిలిమ్స్ పతాకంపై ఈ చిత్రాన్ని రమేష్ పి పిళ్లై నిర్మించారు..యాక్షన్ ఓరియెంటెడ్ సినిమా తెరకెక్కుతుండగా ఈ సినిమాలో సిద్ధార్థ్, జీవీ ప్రకాష్ కుమార్ లు పోటాపోటీగా నటించారు.. వీరి కాంబినేషన్ లో వచ్చే యాక్షన్ చిత్రాలు ఈ చిత్రానికి హైలైట్ గా నిలవనున్నాయి..ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుంటున్న ఈ సినిమా ని శ్రీ లక్ష్మి జ్యోతి క్రియేషన్స్ పై ఏ.ఎన్ బాలాజీ ఈ నెలలో విడుదల చేయనున్నారు. సిద్ధూ కుమార్ సంగీతం అందించగా ప్రసన్న కుమార్ సినిమాటోగ్రఫీ అందించారు. ఈ చిత్రం గురించి పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామన్నారు. 
 
నటీనటులు : సిద్ధార్థ్, జీవీ ప్రకాష్ , కశ్మీర పరదేశి, లిజోమోల్ జోస్
 
సాంకేతిక నిపుణులు : 
 
ఎడిటింగ్ : సాన్ లోకేష్ 
సినిమాటోగ్రఫీ : ప్రసన్న కుమార్
సంగీతం : సిద్ధూ కుమార్
బ్యానర్ : అభిషేక్ ఫిలిమ్స్
సమర్పణ : రమేష్ పి పిళ్లై
నిర్మాత : రమేష్ పి పిళ్లై
దర్శకుడు : శశి
రిలీజ్ బై :  శ్రీ లక్ష్మి జ్యోతి క్రియేషన్స్ -  ఏ.ఎన్ బాలాజీ