హాఫ్ స్టోరీస్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల!!

Updated: Thursday, January 14, 2021, 12:10 [IST]

రాజీవ్, రంగస్థలం మహేష్, రాకేందు మౌళి, కంచరపాలెం రాజు ప్రధాన పాత్రల్లో బేబీ లాలిత్య సమర్పణలో శ్రీ వెన్నెల క్రియేషన్స్ పతాకంపై శివవరప్రసాద్ కె. దర్శకత్వంలో యం. సుధాకర్ రెడ్డి నిర్మించిన చిత్రం "హాఫ్ స్టోరీస్". షూటింగ్ పూర్తి చేసుకున్న  ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను శరవేగంగా జరుపుకుంటుంది. ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ని సంక్రాంతి పండుగ సందర్బంగా చిత్ర యూనిట్ రిలీజ్ చేశారు. డిఫరెంట్ న్యూ కాన్సెప్ట్ తో ఆడియెన్స్ థ్రిల్ ఫీలయ్యేలా శివవరప్రసాద్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. హాఫ్ స్టోరీస్ టైటిల్ కి సూపర్బ్ రెస్పాన్స్ వస్తూంది. కోటి సంగీతం సినిమాకి ప్లస్ పాయింట్ కానుంది. అలాగే ఓ ప్రముఖ హీరో ఈ చిత్రంలో అతిధి పాత్రలో నటించడం విశేషం.. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని త్వరలో ఈ చిత్రం విడుదల కానుంది. 
 
ఈ చిత్రానికి సంగీతం; కోటి, డివోపి; చైతన్య కందుల, ఎడిటర్; సెల్వకుమార్, దర్శకత్వం; శివ వర ప్రసాద్ కె, నిర్మాత; యం. సుధాకర్ రెడ్డి.
 
 
 
 
 
 
Attachments area