వైజాగ్ లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న 'కోతి కొమ్మచ్చి' !

Updated: Sunday, November 22, 2020, 15:43 [IST]

    

 

 వేగేశ్న సతీష్ దర్శకత్వంలో మేఘాంశ్ శ్రీహరి, సమీర్ వేగేశ్న లు హీరోలుగా తెరకెక్కుతున్న యూత్ ఫుల్ ఎంటర్టైనర్ చిత్రం 'కోతి కొమ్మచ్చి' షూటింగ్ విశాఖపట్నంలో జరుగుతుంది. ఇటీవలే అమలాపురంలో కొన్ని కీలక సన్నివేశాలతో పాటు క్లైమాక్స్, సాంగ్స్ షూట్ చేసిన యూనిట్ ప్రస్తుతం వైజాగ్ లో హీరోలు మేఘాంశ్ , సమీర్ హీరోయిన్స్ రిద్ది కుమార్, మేఘా చౌదరి లపై సన్నివేశాలు తీస్తున్నారు. సింగిల్ షెడ్యూల్ లో ఒక సాంగ్ మినహా టోటల్ షూట్ పూర్తి చేయబోతున్నారు. అందుకే ఎలాంటి బ్రేక్ లేకుండా షూట్ చేస్తున్నారు. అమలాపురంలో వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను విపరీతంగా అలరిస్తూ బాగా ఆకట్టుకుంటాయని యూనిట్ సభ్యులు చెప్తున్నారు. త్వరలోనే షూటింగ్ పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేయనున్నారు.


హీరో -హీరోయిన్స్ : మేఘాంశ్ శ్రీహరి , సమీర్ వేగేశ్న, రిద్ది కుమార్ , మేఘ చౌదరి. 

మిగతా నటీ నటులు : రాజేంద్ర ప్రసాద్ , వి.కే. నరేష్, సిజ్జు , అన్నపూర్ణమ్మ, రాజ శ్రీ నాయర్,  మణి చందన , ప్రవీణ్, సుదర్శన్, శివన్నారాయణ తదితరులు 

సంగీతం : అనూప్ రుబెన్స్ 

ఛాయాగ్రహణం : సమీర్ రెడ్డి 

సాహిత్యం : శ్రీమణి 

ఆర్ట్ : రామంజనేయులు 

ఎడిటింగ్ : మధు 

పి.ఆర్.ఓ : రాజేష్ మన్నె

నిర్మాత : ఎం.ఎల్.వి.సత్యనారాయణ 

రచన -దర్శకత్వం : వేగేశ్న సతీష్