హీరోయిన్ శీత‌ల్‌ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా మేకింగ్ స్టిల్స్‌ రిలీజ్ చేసిన `ఒక అమ్మాయితో... కోవిడ్ టైమ్ కహానీ` చిత్ర యూనిట్

Updated: Wednesday, October 28, 2020, 07:07 [IST]

ఏక్ దో తీన్ ప్రొడక్షన్స్ పతాకంపై సూరజ్ పవన్, శీతల్ భట్ ల‌ను హీరోహీరోయిన్లుగా ప‌రిచ‌యం చేస్తూ మురళి బోడపాటి దర్శకత్వంలో గార్లపాటి రమేష్, డా౹౹వి.భట్  సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'ఒక అమ్మాయితో.... `కోవిడ్ టైమ్ కహానీ` అనేది ఉపశీర్షిక. కరోనా టైంలో అన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుంటూ 42రోజుల పాటు ఏకధాటిగా షూటింగ్ జరుపుకుని  సింగిల్ షెడ్యూల్ లో టాకీపార్ట్ పూర్తిచేయడం విశేషం. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. ఈ రోజు హీరోయిన్ శీత‌ల్‌భ‌ట్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఆమెకు శుభాకాంక్ష‌లు తెలుపుతూ మేకింగ్ స్టిల్స్‌ని విడుద‌ల‌చేసింది చిత్ర యూనిట్‌.

తారాగణం: శీతల్ భట్, సూరజ్ పవన్, శ్రీరాగ్,  గుర్లిన్ చోప్రా, రఘు కారుమంచి, అశోక్ కుమార్, శాంతి తివారీ, జబర్దస్త్ ఫణి, జీవన్, పటాస్ పవన్, కె. సురేష్ బాబు, సుశీల్ మాధవపెద్ది తదితరులు

సాంకేతికవర్గం...

బ్యానర్: ఏక్ దో తీన్ ప్రొడక్షన్స్
మూవీటైటిల్: ఒక అమ్మాయితో
క్యాప్షన్: కోవిడ్ టైం కహానీ
రచన, దర్శకత్వం: మురళి బోడపాటి
నిర్మాతలు: గార్లపాటి రమేష్, Dr. V. భట్
సంగీతం: కన్ను సమీర్
సినిమాటోగ్రఫీ: తోట వి.రమణ
ఎడిటర్: కిషోర్ మద్దాలి
ఆర్ట్: పి.ఎస్. వర్మ
కొరియోగ్రాఫర్: భాను