గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటిన నటుడు (విలన్) శత్రు

Updated: Saturday, October 17, 2020, 15:32 [IST]

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా హీరో సందీప్  మాధవ్; సత్యం రాజేష్ ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి నేడు జూబ్లీహిల్స్ లోని పార్కులో మొక్కలు నాటిన ప్రముఖ నటుడు విలన్ శత్రు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొక్కలు కార్బన్ డైయాక్సైడ్ ను పీల్చుకొని మనకు ప్రాణవాయువు అయిన ఆక్సిజన్ ను ఇస్తున్నాయని కాబట్టి రోజు రోజుకి తగ్గిపోతున్న ఆక్సిజన్ పెంచడం కోసం అందరం బాధ్యతగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టి మా అందరి చేత మొక్కలు నాట్ ఇస్తున్న రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ గారికి కృతజ్ఞతలు తెలియజేశారు ఈ సందర్భంగా  ఆది పినిశెట్టి; జెపి ; హరీష్ ఉత్తమన్ లను గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటాలని కోరారు.