వాస్తవ సంఘటనల ఆధారంగా మహాలక్ష్మి బి.ఏ!

Updated: Wednesday, October 21, 2020, 12:52 [IST]

టి.డబ్ల్యూ.ఎస్ టాకీస్ బ్యానర్ పై వస్తోన్న లవ్, డ్రామా చిత్రం మహాలక్ష్మి బి.ఏ. ఇటీవల విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ కు మంచి స్పందన లభించింది. ఈ చిత్ర మొదటి లిరికల్ వీడియో 'ఇప్పుడిప్పుడే' దసరా పండగ సందర్భంగా అక్టోబర్ 25న విడుదల కాబోతోంది.  రమ్య చిన్ని ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీని రాజేష్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఒక అమ్మాయి జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. చిత్రీకరణ మొత్తం హైదరాబాద్ లో జరగనుంది. హర్ష ప్రవీణ్ సంగీతం అందించిన ఈ పాటకు ప్రభాకర్ దండు సాహిత్యం అందించారు.

నిర్మాత: రాజేష్
ఎడిటర్: దీపక్
పబ్లిసిటీ డిజైనర్: రామ్ కోతకొండ
కెమెరామెన్: లోకేష్
లిరిక్స్: ప్రభాకర్ దండు
దర్శకత్వం: రాజేష్