టి.ప్రసన్నకుమార్ ఆవిష్కరించిన "ఇద్దరి లోకం ఒకటే" ప్రచార చిత్రం!!

Updated: Sunday, October 18, 2020, 12:32 [IST]

యువ ప్రతిభాశాలి 'అయ్యప్ప'ను కథానాయకుడిగా మరియు దర్శకుడిగా పరిచయం చేస్తూ ఉమాదేవి ప్రొడక్షన్స్ పతాకంపై డాక్టర్ అంకం సమర్పణలో వై.ఉమాదేవి నిర్మించిన విభిన్న ప్రేమకథాచిత్రం 'ఇద్దరి లోకం ఒకటే'. అయ్యప్ప, అమృత పావని, దివ్య, శ్రీనివాస్ ముఖ్య తారాగణంగా రూపొందిన ఈ చిత్రం ట్రైలర్ ను తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి ప్రధాన కార్యదర్శి టి.ప్రసన్నకుమార్ రిలీజ్ చేయగా.. పోస్టర్ ను యువ దర్శకులు జితేందర్-దర్శకనిర్మాత శివనాగు సంయుక్తంగా ఆవిష్కరించి ముక్కోణపు ప్రేమకథగా తెరకెక్కిన 'ఇద్దరి లోకం ఒకటే' చిత్ర బృందానికి మంచి పేరు తెచ్చిపెట్టాలని ఆకాంక్షించారు. పెద్ద మనసుతో తమ చిన్న చిత్రాన్ని ప్రోత్సహిస్తున్న అతిథులకు చిత్ర దర్శకుడు-కథానాయకుడు అయ్యప్ప కృతజ్ఞతలు తెలిపారు.

     ఇంకా ఈ కార్యక్రమంలో హీరోయిన్లు అమృత పావని, దివ్య, శ్రీనివాస్, వంశీ పవన్, ఈశ్వరరావు వానపల్లి పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: శ్రీకాంత్, ఎడిటింగ్: గణేష్, సమర్పణ: డాక్టర్ అంకం, నిర్మాత: వై.ఉమాదేవి, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: అయ్యప్ప!!