'ట్రు` మూవీ టైటిల్ లోగో విడుద‌ల‌!

Updated: Wednesday, October 14, 2020, 12:47 [IST]

గ్రీన్ లీఫ్ ఎంటర్టైన్మెంట్స్ నూతన నిర్మాణ సంస్థలో గుణశేఖర్, సురేందర్ రెడ్డి మరియు వై వి ఎస్ చౌదరి దర్శకుల వద్ద అసోసియేట్ డైరెక్టర్ గా పని చేసిన శ్యామ్ మండలని దర్శకునిగా పరిచయం చేస్తూ 'ట్రు` అనే సినిమాని నిర్మిస్తున్నారు. థ్రిల్లర్ జానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో 'బైలంపుడి' మూవీ ఫేమ్ హరీష్ వినయ్, 'ఉండిపోరాదే ' ఫేమ్ లావణ్యలు  హీరో, హీరోయిన్ లుగా నటిస్తున్నారు.  ఈ సినిమాలో మెయిన్ విలన్ మధుసూదన్ తో పాటు 'బాహుబలి ' కల్పలత, మణికంఠ,  ఐ డ్రీమ్ టి ఎన్ ఆర్‌, డి ఎస్ రావ్‌, బ్రహ్మానందరెడ్డి, రూపాలక్ష్మి, గని, ఉన్నికృష్ణన్ మరియు శుభోదయం సుబ్బారావు లు నటించారు. 
బేబీ అక్షిత,  కుందన సంయుక్తంగా  సమర్పిస్తున్న ఈ చిత్రం ఇటీవలే  షూటింగ్ పూర్తి చేసుకుని విడుద‌ల‌కి సిద్దంగా ఉంది. 
 
హరీష్ వినయ్, లావణ్య, మధుసూదన్, కల్పలత, మణికంఠ,  ఐ డ్రీమ్ టిఎన్ఆర్‌, డి. ఎస్ రావ్‌, బ్రహ్మానందరెడ్డి, రూపాలక్ష్మి, గని, ఉన్నికృష్ణన్, శుభోదయం సుబ్బారావు  త‌దిత‌రులు న‌టిస్తోన్న 
 
ఈ చిత్రానికి
సినిమాటోగ్రఫీ: శివారెడ్డి, 
ఎడిటర్: జెపి,  
సంగీతం: ఎమ్ జి కె ప్రవీణ్,
ఫైట్స్: శంకర్, 
డాన్స్: కపిల్, 
లిరిక్స్: శ్రీధర్ పల్లె,  విశ్వనాథ్,  
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : జానకిరామారావు పామరాజు, 
స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ & డైరెక్షన్ : శ్యామ్ మండల, 
నిర్మాత : కె.ఆర్,
బ్యానర్ : గ్రీన్ లీఫ్ ఎంటర్టైన్మెంట్స్.