‘పుట్టినే ప్రేమ ప‌డ‌గొట్టినే ప్రేమ..’ అంటూ ప్రేయసి వెంట పడుతోన్న సందీప్ కిషన్ ‘గల్లీ రౌడీ’

Updated: Friday, May 7, 2021, 18:52 [IST]

 
 
‘‘పుట్టినే ప్రేమ ప‌డ‌గొట్టినే ప్రేమ ఏం చేశావో ఏమో క‌ద‌మ్మా
ఇంత‌లో ప్రేమ అంత‌లో కోమా, అత‌లా కుత‌లం అవుతున్నాన‌మ్మా..’’
 
అంటూ ప్రేయసి ప్రేమలో పడిన గల్లీరౌడీ అంటున్నాడు.. ఇంత‌కీ ఈ రౌడీని ప్రేమ‌లో ప‌డేసి అమ్మ‌డు వెనుక అస‌లు క‌థేంటో తెలుసుకోవాలంటే మాత్రం సినిమా చూడాల్సిందేన‌ని అంటున్నారు ‘గల్లీ రౌడీ’ నిర్మాత‌లు. యువ కథానాయకుడు సందీప్ కిషన్ హీరోగా  కె.ఎఫ్.సి ,ఎంవీవీ సినిమా పతాకాలపై జి.నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వంలో ఎం.వి.వి.సత్యనారాయణ, కోన వెంకట్ నిర్మాతలుగా రూపొందుతోన్న చిత్రం ‘గల్లీ రౌడీ’. నేహ హీరోయిన్. శుక్రవారం(మే 7న) సందీప్ కిషన్ పుట్టినరోజు ఈ సందర్భంగా ఈ సినిమా నుంచి ‘పుట్టినే ప్రేమ..’ సాంగ్‌ను విడుదల చేశారు. రామ్ మిర్యాల సంగీతం అందించిన ఈ పాటకు భాస్కరభట్ల సాహిత్యాన్ని అందించారు. పాట సరళమైన పదాలతో అందరికీ అర్థమయ్యేలా చక్కటి సాహిత్యంతో ఆకట్టుకుంటోంది. 
 
రీసెంట్‌గా విడుద‌లైన ఈ సినిమా టీజ‌ర్‌కు ప్రేక్ష‌కుల నుంచి ట్రెమెండ‌స్ రెస్పాన్స్ వ‌చ్చింది. కామెడీ ఎంటర్‌టైనర్స్‌ను తనదైన శైలిలో తెరకెక్కించే డైరెక్టర్ జి.నాగేశ్వర్ రెడ్డి, మరోసారి తనదైన స్టైల్లో తెరకెక్కించాడు.  కామెడీ కింగ్, నటకిరిటీ రాజేంద్ర ప్రసాద్ డిఫరెంట్ రోల్‌తో ప్రేక్షకులకు నవ్వులను పంచబోతున్నారు. బాబీ సింహ కీల‌క పాత్ర‌లో న‌టించారు. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ద‌శ‌లో ఉన్న ఈ సినిమాను త్వ‌ర‌లోనే ప్రేక్ష‌కుల ముందుకు తీసుకువ‌స్తామ‌ని నిర్మాత‌లు తెలిపారు. 
 
 
న‌టీన‌టులు:  సందీప్ కిష‌న్‌, నేహా శెట్టి, బాబీ సింహ, వైవా హ‌ర్ష‌, వెన్నెల కిషోర్‌, రాజేంద్ర ప్ర‌సాద్‌, పోసాని కృష్ణ‌ముర‌ళి త‌దిత‌రులు
బ్యానర్:  కోన ఫిల్మ్ కార్పొరేష‌న్‌, ఎం.వి.వి.సినిమా
స‌మ‌ర్ప‌ణ‌:  కోన వెంక‌ట్‌
ద‌ర్శ‌క‌త్వం:  జి.నాగేశ్వ‌ర్ రెడ్డి
నిర్మాత‌:  ఎం.వి.వి.స‌త్య‌నారాయ‌ణ‌
సంగీతం:  చౌర‌స్తా రామ్‌, సాయికార్తీక్‌
ఎడిట‌ర్‌:  ఛోటా కె.ప్ర‌సాద్‌
స్టైలిష్ట్‌:  నీర‌జ కోన‌